హన్మకొండలో కారులో దొరికిన మృతదేహం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన మానస అనే యువతిగా గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించి విచారణ చేపట్టారు. వినోద్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కారు అద్దెకు తీసుకున్నట్లు గురించించి అతడిని విచారించారు. కరీంనగర్‌లోని గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందిందని, భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు పోలీసులకు వినోద్ తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.