రేవంత్రెడ్డి బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు మాత్రమే క్లియరెన్స్ నిరాకరించడం అంతర్జాతీయ వేదికపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటనను చివరి నిమిషంలో అడ్డుకోవడం వెనుక ప్రొటోకాల్ కంటే రాజకీయ ఉద్దేశమే ఎక్కువగా ఉందన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. రేవంత్రెడ్డి పర్యటన వివాదాన్ని భారత్–అమెరికా సంబంధాల ప్రస్తుత పరిస్థితి నుంచి పూర్తిగా వేరు చేసి చూడలేం. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, టారిఫ్లు, అమెరికా చేపడుతున్న సెక్షన్ 301 దర్యాప్తులు వంటి అంశాల నేపథ్యంలో సంబంధాలు సున్నితమైన దశలో ఉన్నాయి.