కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కార్యకర్తలకు రాజస్థాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. జైపూర్ జిల్లాలోని రాంపురా కన్వర్‌పురా గ్రామంలోని స్కూల్‌ను తనిఖీ చేసేందుకు సీజేపీ కార్యకర్తలు వెళ్తారు. అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఊరిలోకి ప్రవేశిస్తున్న సమయంలో స్థానికులు వారిపై తిరగబడ్డారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. గ్రామస్థులకు బీజేపీ వర్కర్లు తోడైనట్లు తెలుస్తోంది. సీజేపీ కార్యకర్తలను గ్రామస్థులు వెనక్కి నెట్టి పంపించారు.స్కూల్ ఠీక్ కరో ప్రచారంలో భాగంగా సీజేపీ కార్యకర్తలు ఆ గ్రామాన్ని విజిట్ చేశారు..