డాక్టర్ K J రెడ్డి, ప్రభాస్తో కలిసి దిగిన ఫోటోతో పాటు ఆయన పెట్టిన సుదీర్ఘ సందేశంలో ప్రభాస్ ఆరోగ్య బాధ్యతను ప్రస్తావించడంతో పాటు ఆయన పడిన “వ్యక్తిగత త్యాగాల” గురించి రాయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆందోళనతో పాటు కృతజ్ఞతలను వ్యక్తపరుస్తున్నారు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. “మా హీరోని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు డాక్టర్ దయచేసి ఆయన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ బాగుండేలా చూడండి” అని వ్యాఖ్యానించారు.