పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ను అధికారులు రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తరలింపు ప్రక్రియ జరిగింది. గత కొన్నిఆయన ఆరోగ్యంపై రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.