సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రాంత తీరప్రాంతంలో సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్’ అనే వాణిజ్య కార్గో నౌకను అపహరించి, తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. వారిలో ఆరుగురు భారతీయ నావికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమాలియాలోని మొగదిషులో ఉన్న టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి ఈ ఆయుధ సామాగ్రిని చేరవేసే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది