సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ గతంలో బోర్డు (కేంద్ర ప్రభుత్వం) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సీబీఎస్‌సీ బోర్డును, కేంద్రాన్ని ప్రశ్నించింది. త్రిభాషా విధానంపై సమీక్షించాలని సూచించింది. అత్యవసరంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఏంటని బోర్డును ప్రశ్నించింది. మరో పది రోజుల్లో ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతామని చెబుతూ కేసును వాయిదా వేసింది.