తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తనపై సుమంత్‌తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమంత్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.