మార్కుల కోసం వెంటపడకండి. నాలెడ్జ్‌ను, నైపుణ్యాన్ని పెంచుకోండి. అని చెబుతున్నాడు తక్కువ CGPA తోనూ ఎక్కువ జీతంతో ఉద్యోగం సాధించిన విద్యార్థి ఆదిత్య జమ్వాల్. అతడు తక్కువ సీజీపీఏ ఉన్నా రూ. 32 లక్షల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ సంపాదించిన విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఇదే పోస్టులో 9.2 సీజీపీఏ ఉన్న విద్యార్థికి రూ. 6 లక్షలతో ఉద్యోగం లభించిన విషయాన్ని కూడా వెల్లడించాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది మార్కులు కొలమానం కాదు జ్ఞానమే అని.