కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టే విధించిన పధకాలపై తెలంగాణ ప్రభుత్వం స్టే ఎత్తివేయాలని కోరుతూ న్యాయస్థానానికి విన్నపం చేసింది. హైకోర్టు ఉచిత పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జీతాలు, పెన్షన్లు రాక అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టేను తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థితికి చేరుకుందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగంలోని సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలసి హైకోర్టు సూచించింది.