ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు “డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు.