వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయింపై ఓట్ల కోసం కాంగ్రెస్ ‘కొత్త ముస్లిం లీగ్ ‘గా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.వందేమాతరాన్ని అవమానించడం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 1937లో కాంగ్రెస్ తీసుకున్న తీర్మానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ (CWC) నిర్ణయించింది. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని స్పష్టం చేసింది.