సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి ఐసీయూలో చేరారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను వారం రోజుల క్రితమే చెన్నైలో కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. 95 ఏళ్ల షావుకారు జానకి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.