ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. బుధవారం జరిగిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహార శైలిపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.