గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ ఘోర ఉదంతంలో ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్యల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన మీనా, సౌజన్యల మృతదేహాల కోసం 15 మందితో కూడిన SDRF బృందంతో పాటు, 10 మంది స్థానిక మత్స్యకారులు బోట్లతో రెండ్రోజులుగా గాలిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫైర్ సిబ్బంది నదిలో విస్తృతంగా శోధిస్తున్నప్పటికీ వారి ఆచూకీ ఇంకా లభించలేదు.