రాష్ట్రంలో ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ పంచాయతీ సమయంలో రికార్డైన వీడియోలు, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన భార్యతో మాట్లాడిన ఆడియోలు వైరల్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి వీరి ఫ్యామిలీ పంచాయితీ పైనే ఉంది. వీడియోలు బయటకు రావడంతో జోగి రమేష్ కుటుంబం ఇబ్బందికర పరిస్థితిలో పడింది.
ఇరువైపుల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో రాజీవ్ తన తండ్రిపై తీవ్రంగా మండిపడ్డారు. జోగి రమేష్ సహా 11మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేశారు.