6వ తరగతి పాఠ్యపుస్తకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషీన్ లెర్నింగ్ వంటి పాఠ్యాంశాలు ఉండటం చూసి ఎంతో మంది షాక్ అవుతున్నారు. మేం ఇప్పటి విద్యార్థుల కంటే 20ఏళ్లు వెనకబడి పోయాం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఖుషీ జెస్వానీ అనే మహిళ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. “మనం ఇప్పుడు నేర్చుకుంటున్న పైథాన్, ఏఐ (AI) ఇప్పటికే 6వ తరగతి పాఠ్యాంశంలోనే ఉన్నాయి… ఇవన్నీ ఏమిటి? ఇంజనీర్లుగా మన పరిస్థితి ఏంటి?” అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.