టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి పట్ల ఆయన తీవ్ర వేదన వ్యక్తం చేశారు. తన పెంపుడు నేస్తాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘బఘీరా.. ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. అలాగే ఎప్పటికీ ఉంటావు’ అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.