వాట్సప్ లో గంజాయి ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలో ఐదుగురు డ్రగ్ కింగ్ పిన్ లను అరెస్ట్ చేశారు. పోలీసులు ఏకకాలంలో 188 ప్రాంతాల్లో సోదాలు చేశారు. పట్టుబడిన గంజాయి వినియోగదారుల్లో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. గంజాయి ఆర్డర్ పెట్టిన వారిలో 100 మందికి డ్రగ్ టెస్టులు చేయగా, 80 మందికి పాజిటివ్ గా తేలింది. 36 గంటల నాన్ స్టాప్ ఆపరేషన్ తో భారీ డ్రగ్ నెట్ వర్క్ ను పోలీసులు ఛేదించారు.