సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ బీసీలకు భారీ శుభవార్త చెప్పింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 33.13 శాతంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష విధానంలోనే ఎన్నిక జరగనుంది. ఇకపై డిప్యూటీ మేయర్, ఛైర్మన్లుగా ఒకరే ఉండాలని ప్రతిపాదించింది. త్వరలోనే స్థానిక ఎన్నికలకు సంబంధించి తేదీలు ఖరారు కాబోతున్నాయి.