పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో జులై 2న తన కుమారుడు జగదీశెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాధిక్ హత్య చేశాడని పేర్కొన్నారు. “సాధిక్ ఖాన్ నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేశాడు. నా భర్తను సాధిక్ హత్య చేశాడు.నా ఆస్తి, ఫోన్, లాకర్ వివరాలు తీసుకున్నాడు. మతం మారాలని, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. సాధిక్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం” అని సౌజన్య లేఖలో పేర్కొన్నట్టు సమాచారం