తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘ కార్యాలయం నాంపల్లిలో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించారు. పెన్షన్ విధానంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని లోపాలను తక్షణమే సవరించి ఉద్యోగులు,
వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.