రాష్ట్రంలో తాజాగా జిల్లాల పునర్విభజన జరిగింది. ఇందులో భాగంగా పోలవరంతో పాటు మార్కాపురం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మార్కాపురం జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించినందున, తమ జిల్లాకు ఆయన పేరు పెట్టాలంటూ,మార్కాపురం జిల్లాకు చందన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు మారుస్తూ ఉమ్మడిగా ఓ తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ ను కందుల కోరారు.