జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు మరియు లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు లారీ ముందు భాగం నజ్జునుజ్జయ్యింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే రుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు తీవ్ర శ్రమించి అతడిని బయటకు తీశారు.