ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధిస్తోందని ఆరోపించారు వైఎస్ జగన్. శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు టీచర్లు ఎందుకు సస్పెండ్ చేశారు?.. ఏం నేరం చేశారు? అంటూ ప్రశ్నించారు. సర్వీసులో ఉన్న టీచర్లు ఉద్యోగంలో చేరే నాటికి టెట్ పరీక్ష లేదని.. ఇన్ని సంవత్సరాల తర్వాత పరీక్ష రాయాలన్న నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ.. ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? అంటూ ప్రశ్నించారు.