అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు ఇంకా తిరిగి రాలేదు. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటులో ఈ నెల 3న వారు సముద్రంలోకి వేటకు బయలుదేరారు. ఈ నెల 13 నాటికే వారు ఒడ్డుకు చేరాల్సి ఉండగా వారి జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు జిల్లా యంత్రాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మత్స్యకారుల వద్ద కేవలం 15 రోజులకు సరిపడే రేషన్ నిల్వలు మరియు 1,000 లీటర్ల డీజిల్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.