భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని న్యూయార్క్ లో నిర్వహించిన 44వ ఇండియా డే పరేడ్ ఎంతో ఆకట్టుకుంది. ఈ పరేడ్ లో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్దే భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్, ఇతర ప్రముఖులతో కలిసి ఆమె మ్యాన్ హట్టన్ వీధుల్లో జరిగిన వేడుకల్లో భాగమయ్యారు. న్యూయార్క్ లోని భారతీయులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పూజా హెగ్దే బుట్ట బొమ్మ పాటకు చేసిన డ్యాన్స్ SMలో వైరల్ గా మారింది.