బీజేపీ తరఫున సోషల్ మీడియాలో ప్రత్యర్దులపై రెచ్చిపోయే ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్ ఛీఫ్ అమిత్ మాలవీయపై ఇవాళ అనూహ్యంగా వేటు పడింది. 2015 నుంచి బీజేపీకి చెందిన రెండు కీలక విభాగాలకు ఆయన బాస్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్ధానంలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన దీపక్ మస్కేను బీజేపీ నియమించింది. ముఖ్యంగా నిన్న మొన్న పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ రెచ్చిపోతుంటే.. దాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతం కావడం అమిత్ మాలవీయపై వేటుకు కారణంగా తెలుస్తోంది.