డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొంతమంది కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ‘పుష్ప 2’ లో ‘సూసేకి..’ పాట శ్రష్టికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక రజనీకాంత్ ‘జైలర్’ లో ‘నువ్వు కావాలయ్యా’ పాటకు నృత్యరీతులు సమకూర్చారు.’అల వైకుంఠపురములో’, ‘ సహా పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఆమె పనిచేశారు.