డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిందే అని అన్నారు.