భారత సంతతి పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను రష్యా క్షిపణి తాకింది. ఉక్రెయిన్‌లోని క్రివి రిహ్ ప్రాంతంలోని ఉక్కు ఉత్పాదక కేంద్రంపై జరిగిన రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి దాడిలో ప్లాంట్‌లోని కోర్ ఎనర్జీ వ్యవస్థ, బ్లాస్ట్ ఫర్నేస్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షిపణి దాడి ఘటనను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. లక్ష్మీ మిట్టల్ సంస్థ.. ఉక్రెయిన్‌లో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా పేరు పొందింది.