ఆంధ్రప్రదేశ్ ఏవీయేషన్ చరిత్రలో సరికొత్త చరిత్ర అధ్యాయం ప్రారంభం అయింది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టు సేవలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 తొలి విమానం దేశంలోని అత్యంత పొడమైన రన్ వే ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. కొత్త ఎయిర్ పోర్టులోల్యాండ్ అయిన తొలి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ గా ఇండిగో విమానం నిలిచింది.