భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ అటవీ శాఖ.. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వంతారా సహకారంతో కచ్ లోని ప్రసిద్ధ బన్ని గడ్డిభూముల్లోకి 20 కృష్ణజింకలను వదిలిపెట్టారు. ఇందులో 5 మగ, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. గుజరాత్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, సెంట్రల్ జూ అథారిటీ (CZA) నిబంధనల మేరకు సమగ్ర పశువైద్య పరీక్షలు, క్వారంటైన్, సురక్షిత రవాణా ప్రోటోకాల్స్ పాటిస్తూ జామ్ నగర్ లోని వంతారా కేంద్రం నుంచి వీటిని తరలించారు.