జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక టీడీపీ నేత వివాహ వేడుకలో సంజీవరెడ్డి సోదరుడైన మిద్దె శ్రీరామ్ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు. వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లాలని’ డిమాండ్ చేశారు. ఇరువర్గాల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. జేసీ అనుచరులు శ్రీరామ్ రెడ్డికి చెందిన పలు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడి ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో కూడా రాజకీయాలు, రౌడీయిజం చేయడం ఏంటని బాధిత వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.