రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. 2022లో సైనిక ఘర్షణ మొదలైన తర్వాత రష్యా భూభాగంపై జరిగిన అత్యంత భారీ వైమానిక దాడి ఇదే కావడం గమనార్హం. డ్రోన్ల దాడిలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సీఎన్ఎన్ కథనం పేర్కొంది.
కేవలం మాస్కో నగరానికే సుమారు 600 డ్రోన్లు దూసుకువచ్చాయని, అందులో చాలా వాటిని గాల్లోనే పేల్చేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు.