హర్ముజ్ జలసంధిని అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంటుందన్న ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఫుడ్ ట్రక్కులో దాక్కుని దేశం విడిచి వెళ్లాల్సిన దుస్థితి మరోసారి తలెత్తకుండా ట్రంప్ తన సేఫ్టీ గురించి ఆలోచించాలని ఇబ్రహీం అజీజీ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. హర్ముజ్‌ను నియంత్రణలోకి తీసుకోవాలన్న అమెరికా కల కల్లగానే మిగిలిపోతుందని ట్రంప్ పిచ్చి కూతలు మానాలని ఇరాన్ సీనియర్ నేత హితవు పలికారు. హర్ముజ్ చుట్టూ యుద్ధనౌకలు మోహరించినంత మాత్రాన అమెరికాకు తాము బెదిరేది లేదని పేర్కొన్నారు.