ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పోల్ ట్రాకర్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్డీయే కంటే ఇండియా కూటమి ముందంజలో ఉన్నట్లు తేలింది. యూపీలో ప్రాంతాల వారీగా పోల్ ట్రాకర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఫలితాలను ఇవాళ సాయంత్రం దశల వారీగా ఎక్స్ లో ట్వీట్లు చేస్తోంది. పూర్వాంచల్, అవథ్ ప్రాంతాల్లో ఇండియా కూటమికి 44-49 శాతం ఓట్లు, ఎన్డీయేకు 39-45 శాతం ఓట్లు లభిస్తున్నాయి. అలాగే పశ్చిమ యూపీ ప్రాంతంలోని 79 సీట్లలో ఇండియా కూటమికి 48 సీట్లు, ఎన్డీయేకు 34 సీట్లు రాబోతున్నట్లు తేలింది.