స్వాతంత్ర్య దినోత్సవ వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో కూర్చొన్న సీఎం విజయ్ తల్లిదండ్రులు ఎస్ ఏ చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్ ల పక్కనే నటి త్రిష కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. త్రిషను చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ చేతులు ఊపారు. అక్కడి అధికారులను త్రిష నవ్వుతూ పలకరించారు. తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో ఆమె కనిపించారు. విజయ్ పేరెంట్స్ ను ఆప్యాయంగా పలకరించారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. త్రిష, విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.