కర్ణాటకలో గుట్కాను నిషేధిస్తూ కొద్ది రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది వక్క (అడక) రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో గుట్కా నిషేధ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి డీకే ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంతటి కీలకమైన నిర్ణయం తన దృష్టికి రాకుండా ఎలా జారీ చేశారంటూ సీఎం ఆరోగ్యశాఖ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.