డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ గీతాలు, దేశ చరిత్ర, స్వాతంత్ర పోరాట విలువలను గౌరవించాలని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.