అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన ఓ భారత సంతతి మహిళ గ్రీన్ కార్డు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కేసును స్థానిక న్యాయస్థానం కొట్టివేసిన కొన్ని నెలలకే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను నిర్బంధించినట్లు సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యులు.. తక్షణమే ఆమెను విడుదల చేయాలంటూ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేరీ కౌంటీకి చెందిన నరసమాంబ వాసంశెట్టి (59) 2013 నుంచి గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉంటున్నారు. ఆమె పిల్లలు కూడా అమెరికా పౌరులే. ఆమెపై ఎటువంటి కేసులూ లేవు.