ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన జేసీ దివాకర్ రెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం క్రమంగా పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించి లేటెస్ట్ ఫోటో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిని చూసిన నెటిజన్లు, ఈయన ఆయనేనా అని ఆశ్చర్యపోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.