ఉత్తర కోస్తా ఒడిశాలో మళ్లీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగాల్లో నెలకొన్న వాయుగుండం ప్రభావాన కురిసిన భారీ వర్షాలకుగాను బాలేశ్వర్, కేంజేర్, మయూర్భంజ్, భద్రాక్ జిల్లాలు ప్రభావితమయ్యాయి. వైతారని, బుదాబోలంగా, జలక నదులు శుక్రవారం ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. లోతట్టు గ్రామాలు మళ్లీ ముంపునకు గురయ్యాయి. దీంతతో విపత్తుల నియంత్రణ శాఖ అప్రమత్తమైంది. అత్యవసర చర్యలు చేపట్టింది.