శ్రావణ మాసం వ్రతాలకు నిలమైన మాసము. ఈ నెలలో మంగళగౌరీ పూజలు , లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తుంటారు. శ్రావణం పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మీ వ్రతం ఆచరించడం సంప్రదాయంగా వస్తుంది. ఏదైనా అనివార్య కారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం ఆచరించవచ్చు.