రాష్ట్రంలో SIR ప్రక్రియ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బెంగాల్ తర్వాత తెలంగాణే టార్గెట్ అని కొందరు చెబుతున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపు కోసం జరుగుతున్న కుట్రలు ఫలించకూడదని అన్నారు. కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొని మాట్లాడారు.