జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిని వైద్య సహాయం అందించేందుకు, ఎమర్జెన్సీ స్పందన విషయంలో జాప్యాన్ని నివారించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం, NHలపై ప్రమాదం జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్స్ సమాచారం అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలికి తప్పనిసరిగా చేరుకోవాలి. ఆలస్యం చేసినా, కాల్స్‌ను తిరస్కరించినా ఆపరేటర్లపై రూ.10,000 (ఒక్కో ఘటనకు) జరిమానా విధిస్తారు. దూరం పెరిగితే సమయం దామాషా ప్రకారం మారుతుందని నూతన నిబంధనల్లో పేర్కొన్నారు.