ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులపై సీబీఐ ఇచ్చిన వివరణ పట్ల గతంలో అలహాబాద్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కర్నాటక నివాసి ఎస్ విఘ్నేశ్ సిసిర్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ఆధారంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు కూడా గతంలో విఘ్నేశ్ ఓ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.