భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల తెలంగాణ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత లారీని సీజ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.