ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం పరిధిలోకి వచ్చే ఉప్పాడ గ్రామానికి సముద్ర కోత ముప్పు సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన పవన్ .. ఉప్పాడ తీర రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ ఇవాళ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ రక్షణ కోడ నిర్మించేందుకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ -మద్రాస్‌కు ప్రభుత్వం అప్పగించింది.