ఉత్తర కొరియా సైనిక చర్యలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా జపాన్‌పైకి ఉత్తర కొరియా ఒక బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర కొరియా తన తీర ప్రాంతం నంచి జపాన్‌పైకి ఒక మిస్సైల్‌ను పరీక్షించింది. వోన్సమ్ ప్రాంతంలోని ఉత్తర తీరం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్.. జపాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సమీపంలో పడ్డట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కూడా ఉత్తర కొరియా.. జపాన్‌పైకి దాడికి దిగింది.